‘నాటు నాటు’కు ఆస్కార్‌

‘నాటు నాటు’కు ఆస్కార్‌

తెలుగోడి ప్రతిభకు ఆస్కార్‌ పట్టం కట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ అవార్డు దక్కింది. సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్ ఆవార్డును అందుకున్నారు. దక్షిణాది నుంచి ఆస్కార్‌ గెలుచుకున్న తొలి సినిమాగా  ఆర్ఆర్ఆర్ నిలిచింది. నాటు నాటు పాటకు చంద్రబోస్  లిరిక్స్ అందించగా, కీరవాణి  మ్యూజిక్ అందించారు. సింగర్స్ కాలబైరవ, రాహుల్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీలో  హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డ్యాన్స్ తో పాటను ఇంకో లెవల్ కు తీసుకెళ్లారు. వీరందరి ప్రతిభతో పాటుగా రాజమూళి డైరక్షన్ పాటను ఆస్కార్‌ అందుకునేలా చేసింది.