స్టూడెంట్స్ నుంచి లంచాలు : ఓయూ మెడికల్ కాలేజీ HOD ఇంటిపై ACB దాడులు

స్టూడెంట్స్ నుంచి లంచాలు : ఓయూ మెడికల్ కాలేజీ HOD ఇంటిపై ACB దాడులు

హైదరాబాద్ : ఉస్మానియా మెడికల్ కాలేజ్ HOD భూఖ్య బాలాజీ ఇంటిపై గురువారం సోదాలు జరిపింది ACB. మెడికల్ కాలేజీలోని స్టూడెంట్స్ దగ్గర ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో పాస్ చేయిస్తానంటూ భారీగా లంచం తీసుకున్నట్లు సమచారం రావడంతో దాడులు జరిపామని తెలిపారు అధికారులు. అంబర్ పెట్ డీడీ కాలనీలో ఉన్న బాలాజీ  నివాసంలో సోదాలు చేయగా..భారీగా అక్రమ ఆస్తులు, విలువైన డాక్యుమెంట్స్ దొరికాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించామని తెలిపారు ఏసీబీ  అధికారులు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో పాస్ చేయిస్తాను అంటూ విద్యార్థుల నుంచి  డబ్బు వసూలు చేశాడన్నారు. అండర్ గ్రాడ్యుయేట్,  పీజీ విద్యార్థుల ఫిర్యాదుతో భూఖ్య బాలాజీ ఇంట్లో సోదాలు చేశామని తెలిపారు ACB అధికారులు.

16 మంది పీజీ విద్యార్థుల నుంచి 3లక్షలు. 250 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుంచి 8లక్షలు వసూలు చేసిన ఆధారాలు సేకరించామన్నారు. ఇద్దరి విద్యార్థుల దగ్గర 75 వేలు తీసుకున్నారన్నారు. బాలాజీ ఇంటితో పాటు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ లో ఒకేసారి సోదాలు చేశామన్నారు. బాలాజీపై కేసు నమోదు చేసి….రిమాండ్ కి తరలిస్తామని తెలిపారు పోలీసులు.