
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రెండు కేటగిరీల్లో పీహెచ్ డీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. కేటగిరీ -1 కోసం అభ్యర్థులు జాతీయ ఫెలోషిప్ హోల్డర్ అయి ఉండాలి. వీరు ఆగస్ట్ 6 లోపు సంబంధిత డీన్ ను సంప్రదించాలి.
కేటగిరీ-2లో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు ఉంటాయి. కేటగిరి 2 వారికి ఆన్ లైన్ లో దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 18న ప్రారంభమవుతుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 17. మరిన్ని వివరాలు ఓయూ వెబ్ సైట్లను చూడాలన్నారు అధికారులు.