
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ చదివే విద్యార్థులకు ‘బ్యాంకు’ కష్టాలు ఎదురవుతున్నాయి. 2018–19 అకడమిక్ ఇయర్ లో బీఏ,బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్ యూ తదితర డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి, లేట్ ఫీ లేకుండా కట్టేందుకు ఏప్రిల్18ని చివరి తేదీగా నిర్ణయించారు. లాస్ట్డేట్దగ్గర పడటంతో విద్యార్థులు నేషనల్ బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. డిగ్రీ కాలేజీలు ఎక్కువగా కొలువుదీరిన విద్యానగర్, తార్నాక, దిల్ ఖ్ నగర్, కొత్తపేట, ముషీరాబాద్,హిమాయత్ నగర్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడ్ పల్లి, బాగ్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో బ్యాంకులన్నీ ఫీజులు కట్టేం దుకు వచ్చిన విద్యార్థులతో కిక్కిరి సి కనిపిస్తున్నాయి. రూ.500 ఆలస్య రుసుం తో ఏప్రిల్ 26 వరకు ఫీజులు చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ అపరాధ రుసుం భారీగా ఉండటంతో విద్యార్థులు చివరి తేదీలోగా ఫీజులు చెల్లించేం దుకు ఆసక్తి చూపుతున్నారు. నెఫ్ట్ ఆన్ న్ లో డైరెక్ట్ గా ఉస్మానియా యూనివర్సిటీ అకౌంట్‍కు ఫీజులు చెల్లించే అవకాశాన్ని కల్పించారు.
కానీ ఓయూ అకౌంట్స్ కి ఫీజు చెల్లింపు మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయడంలో ఇబ్బందులు ఉండటంతో విద్యార్థులు బ్యాంకుల్లోనే ఫీజులు చెల్లిస్తున్నారు. కానరాని అదనపు కౌంటర్లు 2018–19 అకడమిక్ ఇయర్ లో 6 సెమిస్టర్(రెగ్యులర్), 2, 4 సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్‍లాగ్), సెమిస్టర్ 1, 2, 5(బ్యాక్‍లాగ్) చదివే విద్యార్థులు పరీక్షా ఫీజులు చెల్లించేం దుకు బ్యాంకులలో పడి గాపులు పడుతున్నారు. గతంలో డిగ్రీ కాలేజీలు విద్యార్థుల దగ్గర ఫీజలు వసూలు చేసి ఆ మొత్తాన్ని యూనివర్సిటీ అకౌంట్‍కు బదిలీ చేసేవారు. ఇప్పుడు క్యాష్, డిమాండ్ డ్రాఫ్టులను అనుమతించడం లేదు. ఆన్ న్ లో విద్యార్థుల ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫాంను పూర్తిచేసి అవసరమైన పత్రాలను కాలేజీలు అప్ లోడ్ చేసి ఫీజు చెల్లింపు చలనాలు మాత్రం విద్యార్థుల చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. నగరంలో పలు డిగ్రీ కాలేజీలు సిబ్బంది కొరతతో ఉన్నందున విద్యార్థులతో చలనాలు కట్టిస్తు న్నట్లు కాలేజీ సిబ్బంది చెప్పడం గమనార్హం. కొందరు విద్యార్థులు 2, 3 రోజులు నుంచి బ్యాంకులకు వస్తున్నప్పటికీ రద్దీ దృష్ట్యా ఫీజులు చెల్లిం చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కుదరదు రేపు రండి అంటూ బ్యాంకుల సిబ్బంది సమాధానమిస్తున్నారు.
హడావుడి..
ఫీజు చెల్లిం పునకు చివరి తేదీ దగ్గర పడుతుండడంతో విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా అదనపు కౌంటర్లను బ్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా ఏర్పాట్లు చేసిన దాఖలాలు ఏ బ్యాంకులోనూ కన్పించడం లేదు. కొన్ని బ్యాంకుల సిబ్బంది విద్యార్థులకు నిర్దిష్ట సంఖ్యలో టోకెన్లు అందజేసి వారి ఫీజులను మాత్రమే తీసుకుంటున్నారు. అదనంగా ఉన్న విద్యార్థులను బయటకు పంపిం చి తలుపులు వేసుకుంటున్నారు. రేపు రమ్మంటూ నిర్లక్ష్యంగా చెబుతున్నారు. చివరి తేదీ దగ్గర పడుతుండటంతో విద్యార్థులు కంగారు పడుతున్నప్పటికీ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలు బ్యాంకులో ఫీజు కట్టిం చుకుంటారో లేదో తెలిపే నాథుడే కన్పించడం లేదు. విద్యార్థులకు సమాధానాలు చెప్పేందుకు బ్యాంకు సిబ్బంది విసుక్కుంటున్నారు. సాధారణ బ్యాంకు కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంకు సిబ్బంది అంటున్నారు. బ్యాంకు కష్టాలను గమనించి చివరి తేదీని పొడింగించాలని విద్యార్థులు కోరుతున్నారు.