OTT New Movies: ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ.. తెలుగులో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్

OTT New Movies: ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ.. తెలుగులో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్

చూస్తుండగానే సంక్రాంతి సినిమా పండగ ముగిసింది. థియేటర్లలో సందడి చేసిన ఆ హడావుడి ఇప్పుడు కాస్త చల్లారింది. పోటాపోటీగా రిలీజైన ఐదు తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌ను ఊపేశాయి. వాటిలో రెండు యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంటే, మిగతా మూడు మాత్రం సూపర్ సక్సెస్‌గా నిలిచి సంక్రాంతి విజేతలుగా నిలిచాయి. ఇక థియేటర్ల హీట్ తగ్గగానే…ఓటీటీల్లో అసలైన వరద మొదలైంది!

ఈ వారం (జనవరి 19 నుంచి 25 వరకు) ఏకంగా 30కి పైగా సినిమాలు & కంటెంట్ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, ఆహా వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు ఈ వారం ఫుల్ ప్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. యాక్షన్ నుంచి రొమాన్స్ వరకు, థ్రిల్లర్ నుంచి హారర్ వరకు ప్రతి జానర్‌లోనూ ఓ సినిమా రెడీగా ఉంది. మరి సినిమాలు ఏంటి? అవెక్కడ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉన్నాయి? అనే వివరాలు చూసేద్దాం.. 

నెట్‌ఫ్లిక్స్:

సండోకన్-(యాక్షన్ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 19    

జస్ట్ ఏ డ్యాష్ (సీజన్ 3)    కామెడీ కుకింగ్ ఫుడ్ షో    సిరీస్- జనవరి 20    

రిజోలి & ఐల్స్ (సీజన్ 1-7) (క్రైమ్ మిస్టరీ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 20    

జీరో డే-(పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)-జనవరి 20

కిడ్నాప్‌డ్: ఎలిజిబెత్ స్మార్ట్ ట్రూ క్రైమ్ (డాక్యుమెంటరీ)- జనవరి 21

క్వీర్ ఐ (సీజన్ 10)-(ఎల్‌జీబీటీక్యూ రియాలిటీ షో)-జనవరి 21

గ్లింబాప్ అండ్ ఓనిగిరి-    (జపనీస్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 21    

తేరే ఇష్క్ మే (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్)-జనవరి 23    

ఆహా:

సల్లియర్గళ్-(తమిళ వార్ డ్రామా)- జనవరి 20

శంబాల-(తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ)- జనవరి 22

మారియో- (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్)- జనవరి 23

అమెజాన్ ప్రైమ్:

రెట్ట తలా-(తమిళ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్)-జనవరి 21

చీకటిలో-(తెలుగు హారర్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ)-జనవరి 23

ది బ్లఫ్-(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ )-జనవరి 25

జియో హాట్‌స్టార్

ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్-(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్)-    జనవరి 19

హిమ్- (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ డ్రామా)- జనవరి 19

మార్క్-(తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- జనవరి 23

స్పేస్ జెన్: చంద్రయాన్-(ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా)- జనవరి 23

గుస్తాఖ్ ఇష్క్-(హిందీ రొమాంటిక్ డ్రామా)- జనవరి 23

మెల్ బ్రూక్స్: ది 99 ఇయర్ ఓల్డ్ మ్యాన్-(ఇంగ్లీష్ లెజండరీ కమెడియన్ డాక్యుమెంటరీ)-జనవరి 23

జీ5

45 మూవీ- (తెలుగు డబ్బింగ్ కన్నడ ఫాంటసీ యాక్షన్ డ్రామా)- జనవరి 23

మస్తీ 4-(హిందీ అడల్ట్ కామెడీ)- జనవరి 23

సిరాయ్ (తమిళ కోర్ట్ రూమ్ క్రైమ్ థ్రిల్లర్)- జనవరి 23

కాళీపోట్కా-(బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 23

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ:

డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ సైకలాజికల్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 21

MX ప్లేయర్ ఓటీటీ:

బిండియే కే బాహుబలి సీజన్ 2 (హిందీ యాక్షన్ ఫిక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 21

సంధ్య నమ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా)- జనవరి 22

ముబీ ఓటీటీ:

లా గ్రేజియా (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ)- జనవరి 23

ఇందులో ప్రత్యేకంగా ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’, ధనుష్ ‘తేరే ఇష్క్ మే’, శోభిత ధూళిపాళ్ల నటించిన థ్రిల్లర్ ‘చీకటిలో’, ఉపేంద్ర క్రేజీ ప్రాజెక్ట్ ‘45’, ‘హిమ్’, ‘ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్’, ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’, ‘సంధ్య నామ ఉపాసతే’, ‘మస్తీ 4’, ‘సిరాయ్’, ‘మార్క్’, ‘కాళీపోట్కా’ వంటి సినిమాలు ఇప్పటికే ఆసక్తి రేపుతున్నాయి. మొత్తానికి.. థియేటర్ హడావుడి తగ్గినా, ఓటీటీలో మాత్రం అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. ఈ క్రమంలో రిమోట్ చేతిలో పడితే.. ఏ సినిమా చూడాలన్న కన్ఫ్యూజన్ మాత్రం గ్యారెంటీ!