OTT లోకి వచ్చిన.. ట్రెండింగ్ మూవీస్

OTT  లోకి వచ్చిన.. ట్రెండింగ్ మూవీస్

స్పై..

యంగ్ హీరో నిఖిల్( Nikhil) లేటెస్ట్ మూవీ స్పై (SPY) భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు కలెక్షన్స్ తో నిఖిల్ కెరియర్లో హైహెస్ట్ గ్రాస్ వసూళ్లతో ఈ మూవీ నిలిచింది.

లేటెస్ట్ గా ఈ మూవీ OTT లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఎడిటర్, గ్యారీ బి.హెచ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ నేతాజీ మిస్టరీ వెనుకాల దాగిన కోణాన్ని చూపించాలనుకున్నారు.

కథనం సరిగ్గా ఆకట్టుకోక పోవడంతో బాక్సపీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. ఈ మూవీను రాజశేఖర్ రెడ్డి నిర్మించగా..ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించారు. 

నాయకుడు..

కోలీవుడ్ హీరో ఉదయ్నిధి స్టాలిన్(Udhayanidhi Stalin) తమిళ మూవీ మామన్నన్. తెలుగులో నాయకుడు( Nayakudu) గా వచ్చిన ఈ మూవీ OTT నెట్​ఫ్లిక్స్​లో అందుబాటులోకి వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ మూవీ 50 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది.

ఉదయ్నిధి స్టాలిన్ నుంచి గతంలో వచ్చిన మూవీస్ అన్నీ థ్రిల్లింగ్ అంశాలతో ఉండటం వల్ల తెలుగులో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. పొలిటిల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు మొదటిరోజే ఈ మూవీ  5కోట్ల కలెక్షన్స్ రాబట్టుకున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈసినిమాలో వడివేలు, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. మారి సెల్వరాజ్ ఈ మూవీను డైరెక్ట్ చేశారు. ఉదయానిధి స్టాలిన్ ప్రస్తుతం MLA గా కొనసాగుతున్నారు.