వెబ్ సిరీస్ షూటింగుల జోరు.. ఈశాన్య రాష్ట్రాలకు పెరుగుతున్న ఫ్లైట్ బుకింగ్స్

వెబ్ సిరీస్ షూటింగుల జోరు.. ఈశాన్య రాష్ట్రాలకు పెరుగుతున్న ఫ్లైట్ బుకింగ్స్

న్యూఢిల్లీ: నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్ ​వంటి ఓటీటీలు తమ వెబ్​సిరీస్​ల షూటింగ్​లను ఈశాన్య రాష్ట్రాల్లో చేయడంతో అక్కడి పర్యాటక పరిశ్రమకు  మేలు జరుగుతోంది.  ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, పాతాళ్ లోక్ సీజన్ 2 వంటి సిరీస్‌‌‌‌లను ఈశాన్యంలోనే షూట్​చేశారు. దీంతో  ఇంఫాల్, అగర్తల, దిమాపూర్ వంటి నగరాలకు విమాన ప్రయాణాలు పెరిగాయి. ఫ్లైట్​ బుకింగ్స్​సేవలు అందించే ఇక్సిగో గ్రేట్ ఇండియన్ ట్రావెల్ ఇండెక్స్ 2025 ఈ విషయాన్ని వెల్లడించింది. 

దీని ప్రకారం జపాన్, దక్షిణ కొరియా దేశాలు భారతీయుల ఫేవరెట్ అంతర్జాతీయ గమ్యస్థానాలుగా నిలిచాయి. మహాకుంభమేళా కారణంగా ఉత్తరప్రదేశ్​ నగరం ప్రయాగరాజ్ కు వెళ్లే  ప్రయాణికుల సంఖ్య  భారీగా పెరిగింది. ముఖ్యంగా జెన్ జీ యువత ఆధ్యాత్మిక ప్రయాణాలపై ఆసక్తి చూపుతున్నారు. 

ముంబై  నుంచి ప్రయాగరాజ్ కు ఒక విమాన టికెట్ ధర గరిష్టంగా రూ.92,644 పలికింది. వారణాసిని 2025లో సుమారు 14.7 కోట్ల మంది సందర్శించారు. టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి ప్రయాణాలు 80 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఇక్సిగో రిపోర్ట్ ​వెల్లడించింది.