మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే : కేటీఆర్

మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే : కేటీఆర్

ఉత్తమ్ పార్టీ పదవులు వదులుకోవడం అనేది ఆయన వ్యక్తిగత వ్యవహారం. కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయరాదు. అది నిర్మాణాత్మకంగా ఉన్న సంస్థ.. మా ప్రత్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీఏ. బీజేపీ నా చిన్నప్పటినుంచి ఎలా వుందో ఇప్పుడు అలాగే ఉంది. బీజేపీ ఏంటనేది వాళ్లకు తెలుసు. మాకు తెలుసు. ఒక పోలీస్ అధికారిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి దుర్భాష లాడటం మంచిది కాదు. పోలీస్ అధికారుల సంఘం కూడా ఖండించిందిని తెలిపారు కేటీఆర్.

రైతుబంధు రాకపోతే రోడ్డెక్కేవాళ్లు కదా

రైతుబంధు అందక ఎవ్వరూ ఇబ్బంది పడటం లేదు. అవస్థ పడితే రోడెక్కే వాళ్ళు కదా. అలా అంటే రైతుబందు ఇవ్వక ముందు రాష్ట్రంలో పరిస్థితి ఎంటి..?. మేము, MIM మిత్ర పార్టీలము మాత్రమే.  మాకు రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు.  ప్రత్యర్థులు మాత్రమే ఉన్నారు. కేసీఆర్ ను మించిన హిందువులేడు. బీజేపీ తెచ్చిన బిల్లులకు హిందువులంతా మద్దతు వుందా. సికింద్రాబాద్ లో స్కైవే నిర్మించేందుకు మేము సిద్దం. కానీ సెంట్రల్ డిఫెన్స్ లాండ్ ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి రాకపోయినా తెలంగాణలో IT అభివృద్ది ఆగదని తెలిపారు మంత్రి కేటీఆర్.