- మా వ్యవసాయ భూమి అది
- గుంతలు ఉండి నీళ్లు చేరితే బతుకమ్మలు తెచ్చి వేసేటోళ్లు
- అంతమాత్రాన బతుకమ్మ కుంట అయితదా?
- బీఆర్‌ఎస్‌నేత ఎడ్ల సుధాకర్
అంబర్ పేట్, వెలుగు: ‘బతుకమ్మ కుంట అని ఇప్పుడు పిలుస్తున్న జాగ నాదే. 1986 నుంచి రికార్డులు ఉన్నయ్నా దగ్గర మొత్తం ఏడెకరాలైతే అందులో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉండె.. అక్కడక్కడ గుంతలు ఉండె...చుట్టుపక్కల ఉన్నోళ్లంతా బతుకమ్మలు ఆడి తెచ్చి ఆ గుంతల్లో నీళ్లు చేరితే వేసేటోళ్లు.. అంతమాత్రాన బతుకమ్మ కుంట అయిపోతదా? ప్రతి ఊరిలో ఒక చెరువు ఉంటది. దానికి ఒక పేరు ఉంటది. అసలు బతుకమ్మ కుంట అని పేరే లేదు’ అని అంబర్‌పేట బీఆర్ఎస్ లీడర్ఎడ్ల సుధాకర్‌రెడ్డి అన్నారు. తన దగ్గర రికార్డులు ఉన్నాయి కాబట్టే కోర్టును ఆశ్రయించానని చెప్పారు. బుధవారం ఆయన అంబర్‌పేటలోని తన ఆఫీసులో మాట్లాడారు.
తన దగ్గర రికార్డులు పక్కాగా ఉన్నాయి కాబట్టే హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. స్టేటస్కో ఆర్డర్ఉన్నా అభివృద్ధి కోసం సర్కారు రూ. 8 కోట్లు ఎట్లా మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. ఆ డబ్బులను హైడ్రా చీఫ్ నుంచి రికవరీ చేయాలన్నారు. బతుకమ్మ కుంట పనులు చేస్తున్నప్పుడు కూడా తనను హౌస్అరెస్ట్చేశారన్నారు. దీని వెనక కాంగ్రెస్‌నేత వీహెచ్ఉన్నారని ఆరోపించారు. తోడుగా అఖిలపక్షం ధర్నా చేయడం చూస్తే నవ్వొస్తుందన్నారు. ఇప్పటికే అక్కడ నేమ్ ప్లేట్స్ తొలగించారని, త్వరలోనే బతుకమ్మ కుంట తనకు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

