
న్యూఢిల్లీ: ఐపీఎల్వేలంలో తమ ఫ్రాంచైజీ ఎంచుకున్న ఆటగాళ్లపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. గురువారం జరిగిన ఆక్షన్‌లో ఆర్‌సీబీ క్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, కేన్ రిచర్డ్‌సన్, డేల్ స్టెయిన్ సహా ఎనిమిది మంది ప్లేయర్లను కొనుక్కుంది. ‘మా టీమ్ సెలెక్ట్ చేసిన ఆటగాళ్ల పట్ల హ్యాపీగా ఉన్నా. కొత్త సీజన్ కోసం ఆతృతగాఎదురుచుస్తున్నా.
టీమ్ బ్యాలెన్స్ కోసం గతంలో మేం చాలా చర్చలు జరిపాం. ఈ టీమ్‌ను చూస్తుంటే మాకు మంచి ఆరంభం లభిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. లీగ్‌లో ప్రతి ఒక్కరు పర్సనల్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడం ముఖ్యమని నేను నమ్ముతా. అలాగే, ఈ టోర్నీ ద్వారా క్రికెట్‌లో అత్యుత్తమ ఆటను వారంతా ఎంజాయ్ చేయాలి. నిర్భయంగా ఆడాలి’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.