హైదరాబాద్, వెలుగు: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ రాసిన లేఖపై కూనంనేని సానుకూలంగా స్పందించారు. పట్టభద్రుల శాసనమండలి నియోజవర్గం నుంచి మతతత్వ బీజేపీని ఓడించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
