సీఎం కేసీఆర్​కు పోస్ట్ కార్డులు

సీఎం కేసీఆర్​కు పోస్ట్ కార్డులు

ఓయూ, వెలుగు:తమను రెగ్యులరైజ్​చేయాలని కోరుతూ ఓయూలోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్ట్​కార్డుల ఉద్యమం చేపట్టారు. మంగళవారం ఓయూ ఆర్ట్స్​కాలేజీ నుంచి పోస్ట్​ఆఫీస్​వరకు ర్యాలీగా వెళ్లారు. పర్మినెంట్​చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు లెటర్లు రాసి పోస్ట్​చేశారు.

కాంట్రాక్ట్ టీచర్స్​అసోసియేషన్ లీడర్లు డాక్టర్​ పరశురామ్, తాళ్లపల్లి వెంకటేశ్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్లు డి.తిరుపతి, రమేశ్, కృష్ణయ్య, కోటినాయక్, మీనా తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. చాలీచాలని వ తనాలతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు.