
మెహిదీపట్నం వెలుగు: నిలోఫర్ ఆసుపత్రిలో ఔట్ సోర్స్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఔట్ సోర్స్ ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పేషెంట్ కేర్ ఎంప్లాయ్ అండ్ సెక్యూరిటీ శానిటేషన్ జీవో 60 ప్రకారం వారికి 15,600 రూపాయలు చెల్లించాలని, 12 లీవులు, ఉమెన్స్ కు ఐదు క్యాజువల్ లీవులను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
30 శాతం ఇంక్రిమెంట్ పీఆర్‌సీలో ఆరోగ్యశ్రీ కింద డాటా ఎంట్రీ చేసే ఉద్యోగులకు కూడా న్యాయపరంగా అందించాలని వారు కోరారు. ప్రతి నెల ఫస్ట్ కు జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నక్షత్ర కార్తికేయ సహస్ర ఏజెన్సీలు ఈనెల చివరి తో ముగుస్తుందని, ఈఎస్ఐ పీఎఫ్ క్లియర్ చేసిన తర్వాత టెర్మినేట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై సూపరింటెండెంట్ ఉషారాణి సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.