V6 News

గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన 3 వేల మంది స్టూడెంట్లు

గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన 3 వేల మంది స్టూడెంట్లు
  •     ప్లీనరీ సెషన్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులతో హీరో రానా ఇంటరాక్షన్ 

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను బుధవారం విద్యార్థులు సందర్శించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు జిల్లాల నుంచి వచ్చిన ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలల, డిగ్రీ కళాశాలల, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్టాల్స్ ను పరిశీలించి అక్కడి వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. 

ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్స్, సైబర్ క్రైమ్ కట్టడికి ఉపయోగించి ఆధునాతన పరికరాలు, డ్రోన్స్, రోబోలు తదితర వాటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. కాగా, ఫ్యూచర్ సిటీలో ఈ నెల 13  వరకు ప్లీనరీ సెషన్లు నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగా బుధవారం యూత్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అనే అంశంపై జరిగిన రెండు సదస్సుల్లో 3 వేల మందికి పైగా స్టూడెంట్లు పాల్గొన్నారు. వీరిలో గురుకుల పాఠశాలల నుంచి వెయ్యి మంది, లార్డ్స్ కళాశాల నుంచి 700 మంది, వివిధ డిగ్రీ కళాశాలల నుంచి 1,200 మంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 500 మంది ఉన్నారు. 

సదస్సుల్లో భాగంగా హీరో రానా దగ్గుబాటి, వీ హబ్ సీఈవో సీత పల్లచోళ్ల విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ రైజింగ్’ అనే అంశంపై రానా మాట్లాడారు. హైదరాబాద్ ప్రపంచ క్రియేటివ్ రాజధానిగా ఎదుగుతోందని ఆయన అన్నారు. యువత లక్ష్యాలను పెట్టుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.