అధికారుల నిర్లక్ష్యం..అధిక లోడుతో వాహనాలు రోడ్లపైకి తిరగడంతో ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో ఈ ఘటన ఉదాహరణ. ఇతరుల నిర్లక్ష్యం కారణంగా అమాయకులు బలైపోతున్నారు.ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతున్పటికీ అధికారులు ఏం చేస్తున్నారు.. ఓవర్ లోడ్ వాహనాలను ఎందుకు ఇష్టారాజ్యంగా అనుమతిస్తున్నారు.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కడ జరిగిందో సరైన వివరాలు లేవు గానీ.. ఓ ఓవర్ లోడ్ తో ఇరుకు ఉన్న గల్లీలో వెళ్తున్న ట్రాక్టర్ పాదచారులు, బైకర్లపై పడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. వాహనాలు, నడుచుకుంటూ వెళ్లే వారితో ఇరుకైన గల్లీ రద్దీగా ఉంది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో ధాన్యం బస్తాల ఓవర్ లోడ్ తో ఓ ట్రాక్టర్ నెమ్మదిగా కదులుతోంది..
కొద్ది దూరం కదలిందో లేదో... ఉన్నట్టుండి పక్కనుంచి వెళ్తున్న బైకులు, నడుచుకుంటూ వెళ్లేవారిపై పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. బస్తాల కింద పడి ఇద్దరు బైకర్లు, ఇద్దరు పాదచారులు నలిగిప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అధికారులు, ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓవర్ లోడ్ తో వెళ్లే భారీ వాహనాలకు ఇలాంటి ఇరుకు గల్లీల్లో ఎందుకు అనుమతిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
This overloading can cause heavy damage some day! pic.twitter.com/03mjUGFRdN
— The Jaipur Dialogues (@JaipurDialogues) June 2, 2026
