- ఓవర్ స్పీడే కారణం
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి వివేకానందనగర్‌కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. వివేకానందనగర్నుంచి ఆల్విన్‌కాలనీ వైపు వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్కారు ఓవర్‌స్పీడ్‌తో అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న టూ వీలర్లను, తర్వాత ఎదురుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగిపోకుండా ఏరువాక టిఫిన్సెంటర్లోకి దూసుకువెళ్లింది.
ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా, బండ్లు, టిఫిన్సెంటర్ధ్వంసమైంది. కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
