జూబ్లీహిల్స్: కారు ఓవర్ స్పీడ్ పిల్లాడి ప్రాణాలు తీసింది..స్కూల్కు వెళ్తుండగా ఢీకొట్టిన వాహనం

జూబ్లీహిల్స్: కారు ఓవర్ స్పీడ్ పిల్లాడి ప్రాణాలు తీసింది..స్కూల్కు వెళ్తుండగా ఢీకొట్టిన వాహనం
  •     బంజారాహిల్స్​లో విషాదం 

జూబ్లీహిల్స్ వెలుగు :  బంజారాహిల్స్‌‌లో ఓ కారు ఢీకొట్టడంతో తొమ్మిదేండ్ల బాలుడు కన్నుమూశాడు. మహబూబ్‌‌నగర్ జిల్లా కోటకద్ర గ్రామానికి చెందిన దాసు, బుజ్జి కొన్నేండ్లుగా బంజారాహిల్స్ లో కూలి పనులు చేస్కుంటున్నారు. వీరికి  భాను ప్రసాద్ (9) కొడుకు. స్థానిక జడ్పీ హెచ్​ఎస్​స్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో వాటర్ ట్యాంకర్ జంక్షన్ సమీపం నుంచి స్కూల్​కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. 

అదే టైంలో ఇన్నోవా క్రిస్టా కారు ఓవర్​స్పీడ్​తో దూసుకువచ్చి బాలుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భానను స్థానికులు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్ సాయి గణేష్ పారిపోయాడు. బంజారాహిల్స్​పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.