ఏం ఐడియా రా: ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో డ్రగ్స్.. సిటీలో సప్లయ్

ఏం ఐడియా రా: ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో డ్రగ్స్.. సిటీలో సప్లయ్

డ్రగ్స్.. వీటిని తరలించటానికి స్మగ్లర్లు వేయని ఐడియాలు లేవు.. దొరికేకొద్దీ భలే భలే ఐడియాలు బయటపడుతున్నాయి. వెరీ రీసెంట్ గా హైదరాబాద్ సిటీలో.. ఓ కుర్రోడు డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డాడు. వాడు వేసిన ఐడియాకు అందరూ షాక్ అయ్యారు.. పోలీసులు అవాక్కయ్యారు. డిక్షనరీ.. అందులోనూ ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ.. చిన్నగా.. లావుగా ఉంటుంది. ఈ డిక్షనరీలో డ్రగ్స్ పెట్టి తీసుకెళుతూ అడ్డంగా దొరికేశాడు.. 

డిక్షనరీలో డ్రగ్స్ ఎలా సాధ్యం అంటారా.. అదీ చూద్దాం.. డిక్షనరీ మధ్యలో కాగితాలను ఓ పద్దతిగా కట్ చేశాడు. పెద్ద బాక్సు టైపు ప్లేస్ క్రియేట్ చేశాడు. డిక్షనరీ ఎటూ లావుగా ఉంటుంది కదా.. దీంతో ఈజీగా ఐదారు ప్యాకెట్ల డ్రగ్స్ పెట్టేశాడు.. పైకి చూస్తే చదువుకునే డిక్షనరీలాగే కనిపిస్తుంది.. దాన్ని ఓపెన్ చేస్తే అందుకు డ్రగ్స్ ఉంటాయి.. ఈ తరహాలో డ్రగ్స్ సప్లయ్ చేస్తూ దొరికేశాడు 24 ఏళ్ల గోస్వామి ఆశిష్ గిరి. ఓ బట్టల షాపులో సేల్స్ మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. తనకు వచ్చిన కన్నింగ్ ఐడియాను.. డ్రగ్స్ సప్లయ్ కోసం ఉపయోగిస్తున్నారు..

హైదరాబాద్ సిటీలోని ఛత్రినాక పోలీసులు నాకా బందీ నిర్వహిస్తుండగా.. గోస్వామి ఆశిష్ అనుమానాస్పదంగా కనిపించాడు. తనిఖీ చేస్తే బండారం బయటపడింది. ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో 6 గ్రాముల గంజాయి.. మరో 18 గ్రాముల ఎండీఎంఏ మత్తు మందు ఉన్నాయి. వీటిని సీజ్ చేసి.. గోస్వామితో లింక్స్ ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.