ఖమ్మం జిల్లాలో చకచకా వినాయక విగ్రహాల తయారీ

ఖమ్మం జిల్లాలో చకచకా వినాయక విగ్రహాల తయారీ

వినాయక చవితి సమీపిస్తున్న కొద్దీ గణపయ్య విగ్రహాల తయారీలో వేగం పెరుగుతోంది. ఈనెల 27న చవితి ఉండడంతో ఖమ్మం జిల్లాలో ఇప్పటి నుంచే ఆర్డర్లు షురూ అయ్యాయి. మండపాల్లో కొలువు దీర్చీ భక్తి శ్రద్ధలతో పూజించేందుకు భక్తులు వారికి ఇష్టమైన ఆకారంలో కళాకారులతో విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు. 

పర్యావరణాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు మట్టి విగ్రహాల తయారీకి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి సమీపంలో ఆరు అడుగుల నుంచి 18 అడుగుల ఎత్తు ఉన్న మట్టి విగ్రహాలను పెద్ద సంఖ్యలో తయారు చేస్తున్నారు..  - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం