ప్యాకెట్ పాలతో ఆరోగ్యం ఆగం: వ్యవసాయ శాస్త్రవేత్త ఖాదర్ వలీ

ప్యాకెట్ పాలతో ఆరోగ్యం ఆగం: వ్యవసాయ శాస్త్రవేత్త ఖాదర్ వలీ

మంచి పోషకాల కోసం పాలు తాగడం అందరికీ అవసరమని, కానీ ప్రస్తుతం దొరుకుతున్న ప్యాకెట్ పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఖాదర్ వలీ అన్నారు. నేడు మార్కెట్లో  స్వచ్ఛమైన పాలు దొరకడం గగనమై పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకుల్‌లో సోమవారం నిర్వహించిన ‘ఆహారం – ఆరోగ్యం  రైతు సదస్సు’కు శాస్త్రవేత్త ఖాదర్ వలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఖాదర్ వలీ.. మనిషి  జీవితంలో పాల వినియోగం తప్పని సరిగా మారిపోయిందన్నారు. దేశ వ్యాప్తంగా పాల వ్యాపారం జోరుగా సాగుతోందని, అయితే కొందరు అక్రమార్కులు కృత్రిమ పాలను సృష్టిస్తున్నారని చెప్పారు. ఆ పాలను తాగడం వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోతుందని ఆయన అన్నారు. దీనికి తోడు ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాలను నింపి విక్రయించడం వల్ల మరింత చేటు చేస్తోందని ఖాదర్ వలీ చెప్పారు.