నిజామాబాద్ అర్బన్/కామారెడ్డి టౌన్, వెలుగు: నిజామాబాద్ పట్టణం, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం పద సంచాలన్ నిర్వహించారు. నిజామాబాద్లో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. దేశ సేవలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర కీలకమన్నారు.
విపత్తు సమయంలో కార్యకర్తలు, స్వయం సేవకులు చూపే సేవ అద్భుతమని కొనియాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీక్లిమార్కెట్, అశోక్ నగర్ కాలనీ, దేవునిపల్లి నుంచి మూడు బృందాలు నిర్వహించిన పద సంచాలన్ మున్సిపల్ ఆఫీస్సమీపంలో కలిశాయి. ఇక్కడి నుంచి సరస్వతీ శిశు మందిర్ గ్రౌండ్ వరకు యాత్ర నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత పచారక్ ప్రభుకుమార్, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ సహా సంఘ చలన పాలేటి వెంకట్రావు, జిల్లా సంఘ చలన బొడ్డు శంకర్, సంఘ చలన కొమిరెడ్డి స్వామి పాల్గొన్నారు.
