ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్ష్యానికి చేరువగా వడ్ల కొనుగోళ్లు 

ఉమ్మడి మెదక్ జిల్లాలో  లక్ష్యానికి చేరువగా వడ్ల కొనుగోళ్లు 
  •     ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనుగోలు లక్ష్యం 11.20 లక్షల మెట్రిక్ టన్నులు 
  •     ఇప్పటివరకు 10.16 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ  

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలో యాసంగి సీజన్​ వడ్ల కొనుగోళ్లు లక్ష్యానికి చేరువగా వచ్చాయి. మొత్తం వడ్ల సేకరణ లక్ష్యం 11.20 మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటివరకు 10.16 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. ఏప్రిల్ నెలలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా దాదాపు 80శాతానికి పైగా సెంటర్లను మూసివేశారు.

హమాలీల కొరత, లారీల సమస్య కారణంగా కాస్త కొనుగోళ్లలో జాప్యం జరిగాయి. వర్షానికి పలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు, తూకం వేసి బస్తాల్లో నింపి పెట్టిన వడ్లు తడిసిపోయాయి. ఈ క్రమంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ పరుగులు పెట్టించారు. ఇప్పటివరకు 2,17,113 మంది రైతుల నుంచి వడ్లు సేకరించి సుమారు 1,971 కోట్లు వారి ఖాతాల్లో జమచేశారు.