ప్రధాన ఆలయాల్లో చేనేత శాలువాలే ఇవ్వాలి..పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య 

ప్రధాన ఆలయాల్లో చేనేత శాలువాలే ఇవ్వాలి..పద్మశ్రీ అవార్డు గ్రహీత అంజయ్య 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా అందించే శాలువాలు చేనేతతో తయారైనవి మాత్రమే వినియోగించాలని ప్రముఖ చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ప్రభుత్వాన్ని కోరారు.

మంగళవారం జూబ్లీహిల్స్‌‌‌‌లో మంత్రి కొండా సురేఖను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ వంటి ఆలయాల్లో స్వచ్ఛమైన పత్తి లేదా పట్టుతో తయారైన చేనేత వస్త్రాలను వాడాలని సూచించారు.