నారా రోహిత్ హీరోగా సౌండ్ ఇంజినీర్ మూవీ...

నారా రోహిత్ హీరోగా సౌండ్ ఇంజినీర్ మూవీ...

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు నారా రోహిత్.  శనివారం తన బర్త్ డే సందర్భంగా తను హీరోగా నటిస్తున్న సినిమాల అప్‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌ రివీల్ చేశారు. ఇప్పటికే ‘కపాలి’ సినిమా ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా..  శనివారం  తన 23వ చిత్రం టైటిల్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశాను. ‘సౌండ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో  తెల్లటి కుర్తా, పైజామాతో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కనిపించాడు రోహిత్. ఇక కమెడియన్‌‌‌‌‌‌‌‌ సుదర్శన్‌‌‌‌‌‌‌‌ వాయిస్‌‌‌‌‌‌‌‌తో క్రియేట్ చేసిన కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ వీడియో ఆకట్టుకుంది. 

వినికిడి లోపంతో రోహిత్‌‌‌‌‌‌‌‌ పాత్ర ఉండబోతోందని వీడియో ద్వారా రివీల్ చేశారు. చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి నిర్మిస్తున్నారు. నయన్ సారిక హీరోయిన్‌‌‌‌‌‌‌‌.  నరేష్ వీకే, రోహిణి, సంపత్, అజయ్‌‌‌‌‌‌‌‌, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ,  రఘు కారుమంచి  కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

యువన్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌ రాజా సంగీతం అందిస్తున్నారు.  మరోవైపు వెంకటేష్‌‌‌‌‌‌‌‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం: హౌజ్ నెం 47’ చిత్రంలో నారా రోహిత్ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నట్టు తన లుక్‌‌‌‌‌‌‌‌ను రివీల్‌‌‌‌‌‌‌‌ చేశారు.