- పద్మశ్రీ డాక్టర్ శాంతా సిన్హా
ముషీరాబాద్, వెలుగు: టెక్నాలజీతో ప్రపంచం వేగంగా పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో పుస్తక పఠనం మరింత అవసరమని పద్మశ్రీ డాక్టర్ శాంతా సిన్హా అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చంటి ప్రసన్న కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమెన్ ఎంపవర్‌మెంట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శాంతా సిన్హా మాట్లాడుతూ.. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, అవగాహన పెరుగుతాయన్నారు.
మహిళా సాధికారత అంశాన్ని ఈ పుస్తకంలో చక్కగా, సమగ్రంగా వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్.రాములు, పద్మశ్రీ డాక్టర్ శాంతా సిన్హా, డాక్టర్ వనమాల హరగోపాల్, ఏవీ రావు, రాజీవ్ లక్ష్మీ వాసన్, డాక్టర్ అరుణ పరందాములు పాల్గొన్నారు.
