
- తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం డిమాండ్
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేలా చేనేత బంధు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మచ్చ ప్రభాకర్‌రావు, మురళి శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం అభినందనీయం అన్నారు.
అయితే అందులో పద్మశాలి కులస్తులు లేకపోవడం విచారకరమని వాపోయారు. ప్రభుత్వం స్పందించి లక్ష రూపాయలతోపాటు, అర్హులైన వారికి చేనేత బంధు అందజేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు స్వామి, వెంకన్న, రఘురాం నేత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.