
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు.. పద్మశ్రీ చింతకింది మల్లేశం. తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని తప్పించేందుకు.. ఏడేళ్లు శ్రమించి ఆసు యంత్రాన్ని తయారు చేసినట్లు చెప్పారు. తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మల్లేశం సినిమా ప్రమోషన్ లో భాగంగా.. కరీంనగర్ లో చిత్ర యూనిట్ తో కలిసి సినిమా చూశారు. అంతకు ముందు ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మల్లేశంతో పాటు సినిమా యూనిట్ సభ్యులను సన్మానించారు.