పెయిడ్ బ్లూటిక్ వెరిఫికేషన్ అసలైన మీడియా మాత్రమే

 పెయిడ్  బ్లూటిక్ వెరిఫికేషన్ అసలైన మీడియా మాత్రమే

ఇకపై బ్లూటిక్ వెరిఫికేషన్ కావాలంటే ట్విట్టర్ బ్లూకు  సబ్ స్కైబ్ ప్రీమియం చెల్లించాల్సాందేనని ఆ సంస్థ సీఈవో ఎలన్ మస్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి గానూ సంవత్సరానికి  రూ. 9,400 చెల్లించాలని ట్విట్టర్ వెల్లడించింది. బ్లూటిక్ ఉన్న సోషల్ మీడియా అకౌంట్ మాత్రమే అసలైన మీడియా అవుతుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. పెయిడ్  బ్లూటిక్ వెరిఫికేషన్  బ్యాడ్జ్ బాట్‌ల ధరను పదివేల శాతం పెంచుతుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ఫోన్ ద్వారా బాట్‌లను గుర్తించడం కంపెనీకి చాలా సులభతరం చేస్తుందని, కాబట్టి చెల్లింపు ఖాతాలు మాత్రమే సోషల్ మీడియాగా పరిగణించబడతాయన్నారు. ఫోన్, CC క్లస్టరింగ్ ద్వారా బాట్‌లను గుర్తించడం చాలా సులభం చేస్తుందని ఎలన్ మస్క్ తెలిపారు. 

బ్లూ చెక్ మార్క్ వల్ల యూజర్లకు అనేక ప్రయోజనాలుంటాయి. ట్వీట్లలో ప్రాధాన్యం, తక్కువ యాడ్స్, లాంగ్ ట్వీట్స్, బుక్ మార్క్ ఫోల్డర్స్, కస్టమ్ నావిగేషన్, ఎడిట్ ట్వీట్, అన్ డూ ట్వీట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అమెరికాలో వ్యక్తిగత ట్విట్టర్ బ్లూ చెక్ మార్క్స్ వెబ్‌పై 8 డాలర్లు ఉంది. యాప్‌లో నెలకు 11 డాలర్లు ఉంది.  ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 4,000 క్యారెక్టర్ల వరకు ఉండే లాంగ్ ట్వీట్లు చేయవచ్చు. ఇతరులతో పోలిస్తే 50 శాతం మాత్రమే యాడ్స్ ప్లే అవుతాయి. కంపెనీలు, బ్రాండ్ల అధికారిక ఖాతాలకు గోల్డ్ చెక్ మార్క్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్ చెక్ మార్క్ ఉంటుంది. నెలకు 1,000 డాలర్లు చెల్లించాలని ట్విట్టర్ వ్యాపార సంస్థలను కోరింది. లేకుంటే గోల్డ్ బ్యాడ్జెస్ తొలగిస్తామని హామీ ఇచ్చింది.