భయం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసొచ్చింది : దేశాన్ని దేవుడే కాపాడాలంటూ పార్లమెంట్లో ఎంపీ ఏడుపు

భయం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసొచ్చింది : దేశాన్ని దేవుడే కాపాడాలంటూ పార్లమెంట్లో ఎంపీ ఏడుపు

ఎదుటి వారి శక్తిని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. సైలెంట్ గా ఉన్నారు కదా అని పదే పదే కవ్విస్తే దానికి ప్రతిచర్య ఎలా ఉంటుందో చేసి చూపించింది ఇండియా. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అస్తమానం బార్డర్ లో కాల్పులకు దిగటమే కాకుండా.. టెర్రరిస్టులను పెంచి పోషించిన పాక్ కు వెన్నులో వణుకు పుట్టేలా బుద్ధి చెప్పింది ఇండియన్ ఆర్మీ. 

హల్గాం దాడితో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా.. ఇండియాను టార్గెట్ చేస్తున్న ఆర్మీ బేస్ క్యాంపులపై కూడా దాడులు చేయడంతో పాక్ ఆర్మీ, నేతలు, ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. 

పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్ ’ దాయాది దేశాన్ని పరేషాన్ లో పడేసిందనే చెప్పాలి. తగిన యుద్ధ సామాగ్రి లేక.. అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా చితికి పోవడంతో కొనుగోలు చేసే సామర్థ్యం లేక.. ఇండియా పూర్తి స్థాయిలో దాడి చేస్తే భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో నాయకులు, ప్రభుత్వం, ఆర్మీ పడిపోయింది. పార్లమెంటు సాక్షిగా తమ భయాందోళనలు ప్రకటిస్తున్నారు అక్కడి నేతలు. 

భారత్ దాడి చేస్తున్న క్రమంలో తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ వేడుకున్న మరుసటి రోజే.. పాకిస్తాన్న ఎంపీ చేసిన వ్యాఖ్యలు వాళ్ల పరిస్థితి ఏంటో చెబుతున్నాయి. పాక్ ఎంపీ, రిటైర్డ్ మేజర్ తాహిర్ ఇఖ్బాల్ తమ పరిస్థితిపై ధీనస్థితిలో ఎమోషనల్ అయ్యాడు. పాకిస్తాన్ బలహీనతను బహిరంగంగా చెప్పాడు. ‘‘మమ్మల్ని అల్లానే కాపాడాలి’’ అంటూ పార్లమెంటు సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

ఎంపీ ఏడుస్తూ చేసిన వ్యాఖ్యలు ఏంటి..?

పాకిస్తాన్, భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులు, ఆపరేషన్ సిందూర్ తో జరిగిన నష్టం గురించి పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు ఎంపీ తాహిర్ ఇఖ్బాల్. ఇండియా గురించి మాట్లాడుతూ.. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని వేడుకున్నాడు. ‘‘మా దేశం బలహీనంగా ఉంది. అందరం ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఓ దేవుడా.. ఈ దేశాన్ని నీవే కాపాడాలి.. మీ కాళ్ల మీద పడి వేడుకుంటున్నాం’’ అని పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

►ALSO READ | సైనిక స్థావరాలే లక్ష్యం.. 15 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాక్.. డ్రోన్లు, క్షిపణులను తిప్పికొట్టిన భారత్

‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మా పరిస్థితి  బాలేదు. అందులో మా తప్పు కూడా ఉందనుకోండి. మేము నిస్సహాయులం. మేము పాపులం.. కానీ మేము ఎప్పటికీ మీ భక్తులం. మాపై మీ దయ ఉంచాలి.’’ అని అన్నారు. అదేవిధంగా కశ్మీర్, పాలస్తీనా లోని ముస్లింల పరిస్థితి గురించి కూడా ఆయన మెన్షన్ చేశారు. ‘‘ఓ దేవుడా మమ్మల్ని కాపాడు.. ఈ దేశాన్ని కాపాడు’’ అని కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేశారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ పై భారత్ కొట్టిన దెబ్బకు వాళ్లు ఎంతగా విలవిలలాడుతున్నారో ఈ స్పీచ్ చూస్తే అర్థం అవుతుంది.