వరల్డ్​ కప్​లో నేడు కివీస్​, పాక్​ మధ్య సెమీస్ ఫైట్​

వరల్డ్​ కప్​లో నేడు కివీస్​, పాక్​ మధ్య సెమీస్ ఫైట్​
  • వరల్డ్​ కప్​లో నేడు కివీస్​-పాక్​ మధ్య సెమీస్ ఫైట్​
  • ​మ. 1.30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో 

సిడ్నీ: ఓవైపు బలమైన జట్లపై వరుస విజయాలతో నాకౌట్‌‌‌‌కు దూసుకొచ్చిన న్యూజిలాండ్‌‌‌‌.. మరోవైపు పడుతూ లేస్తూ అనూహ్యంగా ముందంజ వేసిన పాకిస్తాన్‌‌‌‌! నాణ్యమైన ఆల్‌‌‌‌రౌండర్లకు పెట్టింది పేరు కివీస్‌‌‌‌ అయితే.. నిఖార్సైన పేసర్లకు కేరాఫ్‌‌‌‌ అడ్రెస్‌‌‌‌ పాక్‌‌‌‌..! టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఈ రెండు జట్ల మధ్య బుధవారం సెమీఫైనల్​ పోరుకు రంగం సిద్ధమైంది. పేర్​మీద బలంగా కనిపిస్తున్న న్యూజిలాండ్‌‌‌‌.. కీలక మ్యాచ్‌‌‌‌ల్లో ఒత్తిడిని జయించలేదనే అపవాదు ఉండగా, ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని పరిస్థితి పాక్‌‌‌‌ది. తాజా ఫామ్‌‌‌‌ను బట్టి చూస్తే బ్లాక్‌‌‌‌ క్యాప్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఓ మెట్టు పైనే ఉన్నా.. చరిత్ర మాత్రం భిన్నంగా ఉంది. 1992 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో పాక్‌‌‌‌ చేతిలో ఓడిన తర్వాత 1999 (వన్డే), 2007 (టీ20)లోనూ కివీస్​ లాస్ట్‌‌‌‌–4 స్టేజ్‌‌‌‌లోనే వెనుదిరిగింది. ఇక,2015, 2019 వన్డే వరల్డ్​ కప్స్​తో పాటు  గత టీ20 ప్రపంచ కప్​లో  ఫైనల్లో ఓడింది. ఈసారి ఎలాగైనా కప్పు  నెగ్గాలని కివీస్​ ప్లేయర్లు పట్టుదలగా ఉన్నారు. దాంతో, ఈ మ్యాచ్‌‌‌‌లో పాక్‌‌‌‌ను పడగొట్టి ఫైనల్​పై గురి పెట్టారు. అదృష్టం కలిసొచ్చి సెమీస్​ చేరిన పాక్​ రెండో కప్పు కోసం ముందుకెళ్లాలని భావిస్తోంది. 

 టాపార్డర్​ పైనే భారం..

ఈ మ్యాచ్‌‌‌‌ కోసం కివీస్‌‌‌‌ భారీ మార్పులు చేయడం లేదు. పాక్‌‌‌‌లో లెఫ్టాండర్స్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ బ్రాస్‌‌‌‌వెల్‌‌‌‌ను తీసుకునే చాన్స్‌‌‌‌ ఉన్నా.. అది కూడా టాస్‌‌‌‌కు ముందే డిసైడ్‌‌‌‌ చేయనున్నారు. ఓపెనింగ్‌‌‌‌లో ఫిన్‌‌‌‌ అలెన్‌‌‌‌, కాన్వె ఇచ్చే శుభారంభంపై భారీ స్కోరు ఆధారపడి ఉంటుంది. అయితే పాక్‌‌‌‌ పేసర్లను తట్టుకుని వీళ్లు ఏ మేరకు నిలబడతారో చూడాలి. కెప్టెన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావడం శుభసూచకం. సెంచరీతో సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌తో పాటు వేలి గాయం నుంచి కోలుకున్న డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ కూడా చెలరేగితే కివీస్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కష్టాలు తీరినట్లే. వీళ్లు విఫలమైతే మాత్రం లోయర్​ ఆర్డర్​లో ఆల్​రౌండర్లు నీషమ్‌‌‌‌, శాంట్నర్‌‌‌‌పై బ్యాటింగ్‌‌‌‌ భారం పడనుంది. బౌలింగ్‌‌‌‌లో బౌల్ట్‌‌‌‌, సోథీలకు తిరుగులేదు. ఈ ఇద్దరు ఇచ్చే ఆరంభంపై కివీస్‌‌‌‌ విజయం 90 శాతం ఆధారపడి ఉంటుంది. ఫెర్గుసన్‌‌‌‌, నీషమ్‌‌‌‌ కూడా అండగా నిలిస్తే పాక్‌‌‌‌కు ఇబ్బందులు తప్పవు. స్లో పిచ్‌‌‌‌పై శాంట్నర్‌‌‌‌, ఇష్‌‌‌‌ సోధీ బంతిని బాగా టర్న్‌‌‌‌ చేయడం సానుకూలాంశం. 

బాబర్‌‌‌‌ ఏం చేస్తాడో?

వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో టాప్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గా పేరుగాంచిన కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌కు ఈ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఏమాత్రం కలిసి రాలేదు. సూపర్‌‌‌‌–12 రౌండ్​లో అట్టర్‌‌‌‌ ఫ్లాప్‌‌‌‌ అయిన బాబర్‌‌‌‌, రిజ్వాన్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లోగాడిలో పడకుంటే పాక్​ ఫైనల్​ చేరడం కష్టమే. చిన్న టార్గెట్‌‌‌‌ను ఛేజ్‌‌‌‌ చేయడంలోనూ ఈ ఇద్దరి తడబాటు  అతిపెద్ద మైనస్‌‌‌‌గా మారింది. బౌల్ట్‌‌‌‌, సోథీని ఎదుర్కొని వీళ్లు మంచి ఆరంభం ఇవ్వకపోతే జట్టుకు ఇక్కట్లు తప్పవు. మహ్మద్‌‌‌‌ హారిస్‌‌‌‌ వైఫల్యం కూడా వెంటాడుతున్నది. షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌, నవాజ్‌‌‌‌ మిడిలార్డ్‌‌‌‌ను చూసుకున్నా.. టాపార్డర్‌‌‌‌ నుంచి బలమైన ఆరంభం మాత్రం లభించాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ కంటే బౌలింగే ఎక్కువ డేంజర్‌‌‌‌గా కనిపిస్తున్నది.  పేసర్లు షాహీన్‌‌‌‌ ఆఫ్రిది, నసీమ్‌‌‌‌ షా, మహ్మద్‌‌‌‌ వసీంతో కూడిన పేస్‌‌‌‌ త్రయం రన్స్‌‌‌‌ కట్టడితో పాటు వికెట్లూ తీయగల సమర్థులు. రవూఫ్‌‌‌‌, షాదాబ్‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌ కూడా రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. 

జట్లు (అంచనా)

న్యూజిలాండ్‌‌‌‌: అలెన్‌‌‌‌, కాన్వె, విలియమ్సన్​ (కెప్టెన్‌‌‌‌), ఫిలిప్స్‌‌‌‌, డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌, నీషమ్‌‌‌‌, శాంట్నర్‌‌‌‌, సౌథీ, బౌల్ట్‌‌‌‌, ఇష్‌‌‌‌ సోధీ, ఫెర్గూసన్‌‌‌‌.
పాకిస్తాన్‌‌‌‌: రిజ్వాన్‌‌‌‌, బాబర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), హారిస్‌‌‌‌, షాన్‌‌‌‌ మసూద్‌‌‌‌, ఇఫ్తికార్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ నవాజ్‌‌‌‌, షాదాబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ వసీం, నసీమ్‌‌‌‌ షా, షాహిన్‌‌‌‌ ఆఫ్రిది, హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌.