సఫారీలకు డచ్​ పోటు.. సెమీస్‌కు పాక్‌

సఫారీలకు డచ్​ పోటు.. సెమీస్‌కు పాక్‌

అడిలైడ్‌‌‌‌: టీ 20 వరల్డ్‌‌ కప్‌‌ సూపర్‌‌12 రౌండ్‌‌ పోటీల చివరి రోజు అనూహ్య ఫలితాలు వచ్చాయి. గ్రూప్–2 నుంచి సెమీఫైనల్‌‌ ఫేవరెట్‌‌గా కనిపించిన సౌతాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్‌‌ సంచలనం సృష్టించింది. ఈ దెబ్బకు సఫారీ టీమ్‌‌ సెమీస్‌‌ నుంచి వైదొలగడం పాకిస్థాన్‌‌కు లైఫ్‌‌ లైన్‌‌ లభించింది.  ఇండియా, జింబాబ్వే చేతిలో ఓడి వెనుకబడిన పాక్‌‌ ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకుంది.  తమ ఆఖరి పోరులో బంగ్లాదేశ్‌‌ను ఓడించి సెమీస్‌‌ బెర్తు సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో పాక్‌‌ 5 వికెట్ల తేడాతో బంగ్లాపై గెలిచింది. టాస్‌‌ నెగ్గి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు వచ్చిన బంగ్లాను  బౌలర్లు 20 ఓవర్లలో127/8 స్కోరుకే కట్టడి చేశారు.  ఓపెనర్ నజ్ముల్ శాంటో (48 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 54) రాణించాడు. యంగ్‌‌ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది (4/22),  స్పిన్నర్‌‌ షాదాబ్ ఖాన్ (2/30) వరుసగా వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టారు. అనంతరం పాక్‌‌ 18.1 ఓవర్లలో128/5 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్ రిజ్వాన్ (34), కెప్టెన్ బాబర్  (24), మొహమ్మద్ హారిస్ (31 నాటౌట్), షాన్ మసూద్ (24 నాటౌట్) రాణించారు. షాహీన్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

సౌతాఫ్రికా చేజేతులా..

చిన్న జట్టు నెదర్లాండ్స్‌‌పై గెలిస్తే 7 పాయింట్లతో సెమీస్‌‌ చేరే అవకాశాన్ని సౌతాఫ్రికా చేజార్చుకుంది.  డచ్​ టీమ్ అద్భుత బౌలింగ్​, ఫీల్డింగ్​ దెబ్బకు ​ సాధారణ టార్గెట్‌‌ను కూడా ఛేజ్‌‌ చేయలేక 13 రన్స్​ తేడాతో ఓడింది. టాస్‌‌ ఓడిన నెదర్లాండ్స్‌‌ తొలుత 20 ఓవర్లలో 158/4 స్కోరు చేసింది. అకెర్‌‌మన్‌‌ (41 నాటౌట్‌‌), మైబర్గ్‌‌ (37), కూపర్‌‌ (35), ఒడౌడ్‌‌ (39) రాణించారు. సఫారీ బౌలర్లలో కేశవ్‌‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో సౌతాఫ్రికా 145/8 స్కోరుకే పరిమితం అయింది. ఓపెనర్లు డికాక్‌‌ (13 బాల్స్‌‌లో 13), బవూమ (20 బాల్స్‌‌లో 20)తో పాటు రిలీ రొసో (19 బాల్స్‌‌లో 25)  నింపాదిగా ఆడటంతో ఒత్తిడి పెరిగింది. అయినా 15 ఓవర్లకు 111/4 తో నిలిచిన సఫారీ టీమ్‌‌కే మొగ్గు  కనిపించింది. కానీ, 16వ ఓవర్లో  మిల్లర్‌‌ (17), పార్నెల్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన గ్లోవర్‌‌ (3/9) సఫారీలను దెబ్బకొట్టాడు. ముఖ్యంగా మిల్లర్​ ఇచ్చిన క్యాచ్​ను  స్క్వేర్​ లెగ్​లో మెర్వే అద్భుతంగా అందుకోవడం మ్యాచ్​లో టర్నింగ్​ పాయింట్​ అయింది. చివరి 4 ఓవర్లలో 44 రన్స్‌‌ అవసరం అవగా... హిట్టర్‌‌ హెన్రిచ్‌‌ క్లాసెన్‌‌ (18 బాల్స్‌‌లో 21), కేశవ్‌‌ (13) సఫారీలను గట్టెక్కించలేకపోయారు. దాంతో, సౌతాఫ్రికా రెండో ఓటమితో  ఐదు పాయింట్లతో మూడో స్థానంతో సరిపెట్టి సెమీస్​కు దూరమైంది.  జింబాబ్వేతో మ్యాచ్‌‌ వర్షం వల్ల రద్దవడం సఫారీ టీమ్‌‌ను దెబ్బతీసింది. పాక్‌‌ 3 విజయాలు, 2 ఓటములు, 6 పాయింట్లతో రెండో ప్లేస్‌‌తో సెమీస్‌‌ చేరింది. నెదర్లాండ్స్‌‌ 2 విజయాలు, 4 పాయింట్లతో నాలుగో స్థానం సాధించింది.