
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో నేడు ఉదయం పంజాబ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులను అక్కడి తిరుగుబాటుదారులు బస్సు నుండి దింపి కాల్చి చంపారు. అయితే ఈ సంఘటన ప్రావిన్స్‌లోని జోబ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు.
వివరాలు చూస్తే తిరుగుబాటుదారులు క్వెట్టా నుండి లాహోర్ వెళ్తున్న బస్సు నుండి తొమ్మిది మంది ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేసి వారిని కాల్చి చంపారు. అయితే ఈ తొమ్మిది మంది పంజాబ్ ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కాగా, తొమ్మిది మృతదేహాలను పోస్ట్ మార్టం అలాగే ఖననం కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
బలూచిస్తాన్‌లోని రహదారులపై తిరిగే పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తులను ఇంకా ప్యాసింజర్ బస్సులను తిరుగుబాటుదారులు లక్ష్యం చేసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. అయితే ఈ దాడికి ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు, కానీ గతంలో బలూచ్ ఉగ్రవాద సంస్థలు పంజాబ్ ప్రజలపై ఇటువంటి దాడులు చేసాయి. తిరుగుబాటుదారులు క్వెట్టా, లోరలై సహా మస్తుంగ్‌లలో మరో మూడు ఉగ్రవాద దాడులు కూడా చేశారు, అయితే బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ భద్రతా దళాలు ఈ దాడులను తిప్పికొట్టాయని పేర్కొన్నారు.
బలూచిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, తిరుగుబాటుదారులు రాత్రిపూట ప్రావిన్స్‌లో చాల చోట్ల దాడులు చేశారని ఇంకా చెక్ పోస్టులు, ప్రభుత్వ సంస్థలు, పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు సహా కమ్యూనికేషన్ టవర్లపై దాడి చేయడం ద్వారా భద్రతా దళాలతో దాడికి దిగారని పేర్కొన్నారు. ఈ దాడులు వాస్తవమేనని, ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఆయన అన్నారు. ఇరాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న బలూచిస్తాన్ చాలాకాలంగా తిరుగుబాటు చర్యలకు కీలకమైన ప్రదేశం.
బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల గ్రూపులు ఎక్కువగా భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రావిన్స్‌లోని 60 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టుల లక్ష్యంగా దాడులు చేస్తాయి. గత మార్చిలో గ్వాదర్ పోర్ట్ సమీపంలోని కల్మట్ ప్రాంతంలో లాంగ్ బాడీ ట్రైలర్లపై పనిచేస్తున్న ఐదుగురుని కాల్చి చంపగా, ఫిబ్రవరిలో పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఏడుగురు ప్రయాణికులను బర్ఖాన్ ప్రాంతంలో తిరుగుబాటుదారులు అక్కడికక్కడే చంపారు.