అబ్బే మీరు మారరా.. మీకంటూ సొంత ఐడియాస్ ఉండవా..! సూర్యను కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా

అబ్బే మీరు మారరా.. మీకంటూ సొంత ఐడియాస్ ఉండవా..! సూర్యను కాపీ కొట్టిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా

న్యూఢిల్లీ: ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‎లో దాయాది పాకిస్తాన్‎ను మట్టికరిపించి ఆసియా కప్ విన్నర్‎గా భారత్ అవతరించింది. తద్వారా 9వ సారి ఆసియా కప్ టైటిల్‎ను ముద్దాడింది భారత్. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. 

తన ఆసియా కప్ మ్యాచ్ ఫీజు మొత్తం పహల్గామ్ దాడి బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. టోర్నీలో భారత్‎పై మూడు మ్యాచుల్లో ఓటమి పాలై సొంత దేశం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‎ను కాపీ కొట్టి మరోసారి విమర్శల పాలయ్యాడు.

 భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల ప్రభావితమైన పాక్ పౌరులు, పిల్లలకు తమ జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వనున్నట్లు అఘా ప్రకటించాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్‎ను కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్‎కు గురవుతున్నాడు పాక్ కెప్టెన్. 

ALSO READ : Asia Cup 2025 final: ఫైనల్‌కు ముందు కాన్ఫిడెంట్ దెబ్బ తీయడానికేనా.. అర్షదీప్ సింగ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు

ఇండియాపై ఎలాగూ గెలవలేరు.. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా మీకంటూ సొంత ఆలోచనలు ఉండవా.. ఇది కూడా పక్క జట్టు కెప్టెన్‎ను చూసి కాపీ కొడతారా.. కాపీ క్యాట్ అంటూ సల్మాన్‎ను చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు. మరికొందరు ఇండియన్స్ సల్మాన్ కామెంట్స్‎కు కౌంటర్ ఇస్తున్నారు.

 ఆపరేషన్ సిందూర్‎లో ఇండియా పాక్ పౌరులపై దాడి చేయలేదని.. కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే ఎటాక్ చేసిందని.. పాక్ కెప్టెన్ ముందు ఈ విషయం తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు. ఈ టోర్నీ ఆసాంతం ఇండియా, పాక్ మ్యాచులు కాంట్రవర్శీలకు కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. నో షేక్ హ్యాండ్ వివాదం కుదిపేసింది.