మామూలుగా చెబితే అర్థం కాదు : ఢిల్లీ టార్గెట్ గా పాకిస్తాన్ ఫతా 2 క్షిపణి ప్రయోగం.. హర్యానాలో కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

మామూలుగా చెబితే అర్థం కాదు : ఢిల్లీ టార్గెట్ గా పాకిస్తాన్ ఫతా 2 క్షిపణి ప్రయోగం.. హర్యానాలో కూల్చేసిన ఇండియన్ ఆర్మీ

ఒక పక్క భారత దళాల దాటికి విలవిలలాడుతున్నప్పటికీ.. తన బుద్ధి చూపిస్తూనే ఉంది పాకిస్థాన్. భారత్ పై మిస్సైళ్లతో దాడికి పాల్పడుతూ రెచ్చగొడుతోంది పాకిస్థాన్. పాకిస్థాన్ డ్రోన్లను మన సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా.. మళ్ళీ క్షిపణులు ప్రయోగించింది పాక్. ఈసారి ఢిల్లీ ని టార్గెట్ చేసుకున్న పాక్.. శనివారం ( మే 10 ) ఫతా 2 క్షిపణి ప్రయోగించింది. అయితే.. ఇండియన్ ఫతా 2 క్షిపణిని కూల్చేసింది. హర్యానాలోని సిర్సా సమీపంలో భారత వైమానిక రక్షణ దళాలు ఆ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సమాచారం.

ఫతా 2 క్షిపణి అనే ఉపరితలం నుండి ఉపరితలానికి 400 కిలోమీటర్ల రేంజ్ తో ఉంటుందని తెలుస్తుంది. శనివారం తెల్లవారుజామున, రావల్పిండిలోని నూర్ ఖాన్, పంజాబ్‌లోని చక్వాల్‌లోని మురిద్, షోర్కోట్‌లోని రఫీకితో సహా నాలుగు పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత దళాలు దాడి చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడి జరిగినట్లు ఆ దేశ డైరెక్టర్ జనరల్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వెల్లడించారు.

ఎల్ఓసీ వెంబడి 26 డ్రోన్లు కనిపించాయని.. వీటిలో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయి. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, లాల్‌గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్ మరియు లఖీ నాలా ఉన్నాయి. విచారకరంగా, ఫిరోజ్‌పూర్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడికి పాల్పడ్డట్టు ప్రభుత్వం తెలిపింది.