IND vsPAK: సెమీస్కి చేరేందుకు భారత్ కంటే పాకిస్తాన్కే ఎక్కువ ఛాన్స్!

IND vsPAK: సెమీస్కి చేరేందుకు భారత్ కంటే పాకిస్తాన్కే ఎక్కువ ఛాన్స్!

IND vsPAK: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8కి చేరుకున్న పాకిస్తాన్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. వర్షం కారణంగా న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో పాక్ జట్టు సెమీ ఫైనల్ వెళ్లడం కొంచెం కష్టమైంది. సూపర్ 8లో భాగంగా జరిగే ప్రతి మ్యాచ్ లో జట్లు అన్ని గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ వర్షంతో న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మొదటి మ్యాచ్ రద్దు అయింది. దీంతో రెండు జట్లకు తలో పాయింట్ వచ్చింది. ఇప్పుడు పాక్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో కచ్చితంగా రెండు గెలిస్తేనే, సెమీ ఫైనల్ కి వెళ్తుంది. లేకపోతే పాకిస్తాన్ కూడా బ్యాగులు సర్దుకొని లాహోర్ వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇదే విషయం ఇప్పుడు దాయాది జట్టును కలవర పెడుతోంది.

సెమీస్ చేరాలంటే ఏం చేయాలి ?:
 పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు కేవలం 50 శాతం మాత్రమే ఉన్నాయి. సూపర్ 8లో మిగిలిన రెండు మ్యాచ్ ల్లో పాక్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడే సెమీస్ కి ఈజీగా వెళ్తుంది.. లేదంటే, ఒక మ్యాచ్ లో భారీ స్కోర్ తేడాతో గెలవాలి.. అయినప్పటికీ మిగిలిన జట్ల ఫలితాల ఆధారంగా దాయాది టీం సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే పాకిస్తాన్ సెమీస్ కి వెళ్లడం కొంత మేర కష్టమే.. 

శ్రీలంక, ఇంగ్లాండ్ వంటి జట్లతో మరో రెండు మ్యాచులను పాకిస్తాన్ ఆడాల్సి ఉంది. శ్రీలంక ఎలాగూ అతిథ్య జట్టు కాబట్టి, వాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇటు ఇంగ్లాండ్ కూడా చాలా స్ట్రాంగ్ టీం.. ఆ రెండిటిని పాక్ కొట్టడం అంటే, చాలా కష్టమేనని అంటున్నారు. దీంతో పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు, భారత జట్టు 76 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడిపోయింది. దీంతో సూర్యసేన కంటే పాకిస్తాన్ కొంత మెరుగైన స్థితిలో ఉందని చెప్పాలి.