Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్.. రేసులో ఉండాలంటే గెలవాల్సిందే

Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్.. రేసులో ఉండాలంటే గెలవాల్సిందే

వరుసగా రెండు విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. పసికూన ఆఫ్ఘనిస్తాన్ పై ఘోర పరాభావం వరల్డ్ కప్ లో ఇది పాకిస్థాన్ పరిస్థితి. దీంతో పాక్ సెమీస్ కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నేడు పటిష్టమైన దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఓడితే పాక్ సెమీస్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇక ఈ మ్యాచ్ లో పాక్  రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సీనియర్ బౌలర్ హసన్ అలీ గాయం కారణంగా దూరం కాగా.. మహమ్మద్ వసీమ్ జూనియర్ వచ్చి చేరగా.. స్పిన్నర్ నవాజ్ ను జట్టులోకి తీసుకొచ్చింది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ బావుమా రాగా.. రబడా, విలియమ్స్ స్థానంలో షంసి, ఎంగిడి వచ్చి చేరారు.          

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):

అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్