
లార్డ్స్ లో బంగ్లాతో పాక్ ఇంట్రస్టింగ్ ఫైట్
లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో పాకిస్థాన్ ఆసక్తికరమైన మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ తో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్…. భారీ స్కోరు చేసింది. ఐతే… భారీ తేడాతో నెగ్గితేనే పాక్ సెమీస్ కు పోగలుగుతుంది. బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ 315 రన్స్ చేసింది. 316 రన్స్ టార్గెట్ పెట్టింది. న్యూజీలాండ్ ను కాదని.. సెమీస్ లోకి పాకిస్థాన్ వెళ్లాలంటే… కేవలం 7 రన్స్ లోపే బంగ్లాదేశ్ ను పాక్ ఆలౌట్ చేయగలగాలి. కానీ అది అసాధ్యం కావడంతో.. వరల్డ్ కప్ లో పాక్ కథ ముగిసినట్టయింది.