Crickek World Cup 2023: 15 మందిలో నలుగురికి జ్వరాలు.. దిక్కుతోచని స్థితిలో పాక్ జట్టు

Crickek World Cup 2023: 15 మందిలో నలుగురికి జ్వరాలు.. దిక్కుతోచని స్థితిలో  పాక్ జట్టు

వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి జోరు మీదున్న పాక్ కి భారత్ బ్రేకులు వేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ని చిత్తు చేసి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టింది.  అసలే ఓటమి బాధలో ఉన్న పాక్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులోని ప్రధాన ఆటగాళ్లు జ్వరంతో ఇబ్బందిపడుతున్నారని తెలుస్తుంది. 

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్ శుక్రవారం (అక్టోబర్ 20) ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచు కోసం ఇప్పటికే బెంగళూర్ చేరుకున్న పాక్ ఆటగాళ్లకు ఇక్కడ వాతావరణం సరిపోలేదని.. ప్రాక్టీస్ సెషన్స్ లో కొంతమంది ఆటగాళ్లు  పాల్గోలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికీ పాక్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది జ్వరంతో బాధపడుతున్నాడని, ఆస్ట్రేలియాతో కీలక పోరుకు ఆడడం అనుమానంగా మారిందని పాకిస్తాన్ మీడియా మంగళవారం నివేదించింది.

శ్రీలంకతో వరల్డ్ కప్ లో అరంగ్రేటం చేసిన ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జ్వరంతో ఇబ్బదిపడుతున్నట్లు సమాచారం. ఇక పాక్ స్పిన్నర్ ఉస్మాన్ మీర్, మహమ్మద్ వసీం జూనియర్ నెట్స్ లో అసౌకర్యంగా కనిపించారని తెలుస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా లాంటి కీలక మ్యాచులో వీరు కోలుకోకపోతే పాక్ కి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎంతమంది  కోలుకొని ఆసీస్ మ్యాచులో ఆడతారో చూడాలి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం మూడు మ్యాచులాడిన పాక్ రెండు విజయాలు సాధించగా.. ఆసీస్ కి  మూడు మ్యాచుల్లో ఒక్క గెలుపు దక్కింది. దీంతో ఈ మ్యాచులో ఎవరు విజయం సాధిస్తారో ఆసక్తికరంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచుకు ఆతిధ్యమిస్తుంది.                     

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)