Crickek World Cup 2023: వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర: ఒక్క విజయంతో భారత్ రికార్డ్ బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా..

Crickek World Cup 2023: వరల్డ్ కప్‌లో సరికొత్త చరిత్ర: ఒక్క విజయంతో భారత్ రికార్డ్ బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా..

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వరుసగా రెండు ఘోర ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకున్న కమ్మిన్స్ సేన నిన్న(అక్టోబర్ 16) శ్రీలంకపై భారీ విజయం సాధించి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వన్డే వరల్డ్ కప్ లో భారత్  రికార్డ్ ని బ్రేక్ చేసి ఆసీస్ టాప్ లోకి వెళ్ళింది. 

ఇప్పటివరకు ఆస్ట్రేలియా శ్రీలంకపై వరల్డ్ కప్ చరిత్రలో మొత్తం 9 సార్లు విజయం సాధించింది. దీంతో ఒకే జట్టుపై వరల్డ్ కప్ లో ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా ఆసీస్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. లంకపై వరల్డ్ కప్ లో ఆసీస్ మొత్తం 11 మ్యాచులాడగా.. 9 విజయాలు సాధించి కేవలం రెండిట్లోనే ఓడింది. మరోవైపు భారత్ పాకిస్థాన్ పై ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. 

Also Read :- ఆ కుర్రాడు ఆఫ్ఘనిస్థాన్ కాదు

విజయాల శాతం భారత్ కి 100 శాతం ఉన్నప్పటికీ, ఎక్కువ విజయాలు మాత్రం ఆస్ట్రేలియాకు ఉన్నాయి. నిన్నటివరకు ఈ 8 విజయాలతో రెండు జట్లు సమంగా నిలవగా.. నిన్నటి శ్రీలంక మ్యాచుతో ఆ రికార్డ్ బ్రేక్ అయింది. దీంతో ఈ అరుదైన రికార్డ్ ఆసీస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 

కాగా.. ఈ మ్యాచులో శ్రీలంక విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ప్రారంభంలో వార్నర్, స్మిత్ వికెట్లు కోల్పోయినా.. మిచెల్ మార్ష్(52), ఇంగ్లీష్(58) అర్ధ సెంచరీలతో జట్టుకి విజయాన్ని అందించారు. నాలుగు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జంపాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.