Crickek World Cup 2023: ఆ కుర్రాడు ఆఫ్ఘనిస్థాన్ కాదు.. అసలు నిజాన్ని బయట పెట్టిన ముజీబ్

Crickek World Cup 2023: ఆ కుర్రాడు ఆఫ్ఘనిస్థాన్ కాదు.. అసలు నిజాన్ని బయట పెట్టిన ముజీబ్

వరల్డ్ కప్ లో భాగంగా  ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఏ ఫార్మాట్ లోనైనా ఇంగ్లాండ్ పై ఆఫ్ఘన్ కి ఇదే తొలి విజయం కావడం విశేషం. వరల్డ్ కప్ లో వరుసగా 11 ఓటముల తర్వాత ఈ గెలుపు రావడంతో ఆ దేశ అభిమానుల సంబరాలు అంబరాన్ని దాటాయి. ఈ మ్యాచు అనంతరం ఒక చిన్నపిల్లవాడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్-ఉర్-రెహ్మాన్ దగ్గరకు వచ్చి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు.
 
ముజీబ్ కూడా ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకొని పొంగిపోయాడు. ఈ కుర్రాడు ముజీబ్ కి దగ్గర వాడని కొందరు అనుకుంటే.. ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్ అని మరికొందరు అనుకున్నారు.  అయితే ఆ కుర్రాడు ఇండియా వాడే అని ముజీబ్ అసలు విషయాన్నీ బయట పెట్టాడు. తాజాగా ముజీబ్ ఈ  విషయంపై మాట్లాడుతూ.. అతడు ఆఫ్ఘని కుర్రాడు కాదు. ఢిల్లీ కుర్రాడు. గత రాత్రి ఆ చిన్నపిల్లవాడిని కలవడం చాలా ఆనందంగా ఉంది. అని చెప్పుకొచ్చాడు. 

Also Read :- నిన్న హైదరాబాద్ బిర్యానీ.. ఇవాళ బెంగళూరు కబాబ్స్

భారతీయలు మాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు చాల ఆనందంగా ఉంది. క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు ఇందులో చాలా  ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇంగ్లాండ్ పై మ్యాచులో ఢిల్లీలో మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. భవిష్యత్తులో మీరు మాకు మద్దతిస్తారని కోరుకుంటున్నాను అని ఈ మిస్టరీ స్పిన్నర్ ట్వీట్ చేసాడు.

కాగా.. ఈ మ్యాచులో 284 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లాండ్ పై 69 పరుగుల తేడాతో నెగ్గింది. బ్యాటింగ్ లో గుర్బాజ్ మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. వికెట్ కీపర్ ఇక్రం అలీ, ముజీబ్, రషీద్ ఖాన్ రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్ స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్‌ 215 పరుగులకే ఆలౌటైంది. ముజీబ్, రషీద్ చెరో మూడు వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ ని చావు దెబ్బ కొట్టారు.