దుబాయ్: ఇండియా విమెన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా జాబితాలో హర్మన్ (652) ఒక్క ప్లేస్ ఎగబాకి ఏడో ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్ బ్యాటర్ సోఫీ డివైన్ (649) రెండు ర్యాంక్‌లకు కిందకు దిగజారడంతో హర్మన్ ర్యాంక్ మెరుగైంది. ప్రస్తుతం డివైన్ 9వ ర్యాంక్‌లో ఉంది. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (790) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. జెమీమా రోడ్రిగ్స్ (635).. 12వ ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు.
దీప్తి శర్మ (559), ప్రతీకా రావల్ (554), రిచా ఘోష్ (544) వరుసగా 28, 30, 32వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ (614), రేణుకా సింగ్ (542) వరుసగా 10, 18వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి (770), షెఫాలీ వర్మ (725), జెమీమా రోడ్రిగ్స్ (644) వరుసగా 2, 6, 11వ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బౌలింగ్‌లో దీప్తి శర్మ (717) నాలుగో ర్యాంక్‌లో నిలిచింది.
