పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయాలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయాలు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఇస్లామాబాద్ లోని తన కార్యాలయంలో జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌కు ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చట్టపరంగా, రాజకీయంగా, ద్వైపాక్షికంగా ఎలా స్పందించాలన్న దానిపై సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం పాక్.. భారత్ తో సంబంధాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటంటే..

  1. భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించడం.
  2. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడం.
  3. ద్వైపాక్షిక ఏర్పాట్లపై సమీక్ష.

భారత రాయబారిని బహిష్కరించిన పాక్

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తన స్వభావాన్ని వెళ్లగక్కింది. ఆ దేశ భారత రాయబారిని బహిష్కరించింది. అంతేకాకుండా పాక్ హై కమీషనర్ ను భారత్ కు పంపకూడదని నిర్ణయించింది. పాక్ లో ఉన్న  భారత హై కమీషనర్ అజయ్ బిశ్రాను కూడా పాక్ తిరిగి ఇండియాకు పంపే ఆలోచనలో ఉంది.