
- క్షుణ్ణంగా చేసిన తనిఖీ చేసిన సెక్యూరిటీ సిబ్బంది
శంషాబాద్, వెలుగు: పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ పేరుతో శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబ్బెదిరింపు ఈ – మెయిల్ వచ్చింది. ‘పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టినందుకు ప్రతీకారంగా శంషాబాద్ఎయిర్పోర్టును బాంబులతో పేల్చేస్తాం.. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి చెప్పండి’ అని అందులో పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ జవాన్లు, పోలీసులు ఎయిర్‌పోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అణువణువు గాలించారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థం కానీ, బాంబ్కానీ లభ్యం కాలేదు. యుద్ధ సమయంలో ఫేక్ మెయిల్ అని కొట్టిపారేయలేమని, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ– మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో లోతుగా విచారిస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చి ప్రతి వ్యక్తిని, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని చెప్పారు.