భారీ భూకంపంతో పాకిస్తాన్ మట్టిలో కలిసిపోనుందా...? : శాస్త్రవేత్తల హెచ్చరిక

భారీ భూకంపంతో  పాకిస్తాన్ మట్టిలో కలిసిపోనుందా...? : శాస్త్రవేత్తల హెచ్చరిక

ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయం అవునుందా..?  పాకిస్తాన్ మట్టిలో కలిసిపోనుందా..? ఆ దేశం నాశనం కానుందా..అంటే అవును అనే అంటున్నారు  డచ్ శాస్త్రవేత్త. రాబోయే 48 గంటల్లో పాకిస్తాన్ లో అత్యంత భారీ భూకంపం..బలమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని వెల్లడించాడు. ఈ తీవ్రమైన భూకంపం ధాటికి పాకిస్తాన్ నామరూపాల్లేకుండా పోతుందని   హెచ్చరించాడు. వివరాల్లోకి వెళ్తే.. 

పాక్ వినాశనం తప్పదా..?

 నెదర్లాండ్స్‌కు చెందిన ఓ పరిశోధనా సంస్థ పాకిస్తాన్ లో భూకంపం సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. పాకిస్తాన్‌లో రాబోయే 48 గంటల్లో  విధ్వంసకర భూకంపం వస్తుందని అంచనా వేసింది.  సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే కు చెందిన ఒక పరిశోధకుడు.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించామని.. ఇది రాబోయే బలమైన భూకంపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్‌బీట్స్‌ ఈ విషయాన్ని తెలియజేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

భయాందోళనలో పాక్ ప్రజలు..

పాకిస్తాన్ లో రానున్న 48 గంటల్లో  పెను భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ లో భారీ భూకంపానికి సంబంధించిన అంచనాలు వెలువడిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  ప్రాణాలను దక్కించుకునేందుకు ఏం చేయాలంటూ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ఎక్కడికి పోవాలి..ఏం చేయాలని బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో భూకంపం సంభవిస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. 

ALSO READ: ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు : ఊగిపోయిన బిల్డింగ్స్.. బయటకు పరుగులు

డచ్ శాస్త్ర వేత్త అంచనా నిజమయ్యాయి..!

 డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్‌బీట్స్‌ గతంలో టర్కీ, సిరియాలో ప్రమాదకరమైన భూకంపాలను అంచనా వేశాడు. టర్కీ, సిరియాలో గ్రహాల అమరికలను ఉపయోగించి ఘోరమైన భూకంపాలను ముందే ఊహించారు. ఫ్రాంక్ అంచనా నిజమైంది. టర్కీ, సిరియాలో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. దీని దాటికి 50,000 మందికి పైగా మరణించారు. 

భూకంపాలను ఊహించగలమా..?

పాకిస్తాన్ లో భారీ భూకంపం వస్తుందన్న డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్ బీట్స్ వ్యాఖ్యలను  కరాచీలోని  నేషనల్ సునామీ సెంటర్ డైరెక్టర్  అమీర్ హైదర్ లఘారి కొట్టిపారేశారు. భూకంపం సంభవించే  స్థలాన్ని,  సమయాన్ని ఎవరూ అంచనా వేయలేరని వెల్లడించారు.  రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులు పాకిస్థాన్ గుండా వెళుతున్నాయని, సోన్మియాని నుంచి పాకిస్థాన్ ఉత్తర ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయని, ఈ సరిహద్దు రేఖల్లో ఏ సమయంలోనైనా భూకంపం సంభవించవచ్చని తెలిపారు. అయితే  ఇది ఊహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.