పాకిస్థాన్‌ లో మన హీరోల స్కిట్స్ తో 'బాలీవుడ్ డే'

పాకిస్థాన్‌ లో మన హీరోల స్కిట్స్ తో 'బాలీవుడ్ డే'

పాకిస్థాన్ లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (LUMS)కి చెందిన కొందరు విద్యార్థుల బృందం ఇటీవల 'బాలీవుడ్ డే'ని ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్  దేవదాస్ నుండి హేరా ఫేరీలో పరేష్ రావల్ బాబూరావు వరకు స్టూడెంట్స్ బాలీవుడ్ సినీ హీరోలను అనుకరించారు. దాంతో పాటు సినిమాల్లో వారి పాత్రలు ఎలా చేశాయో అదే తరహాలో రెడీ అయ్యి, ఫేమస్ డైలాగ్స్ చెప్పారు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు వేలాది మంది లైక్ కొట్టగా, అనేక కామెంట్లు వచ్చాయి. అయితే ఈ స్టూడెంట్ల వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తు్న్నారు. పాకిస్థాన్‌లో భారతీయ సంస్కృతిని జరుపుకోవడాన్ని కొందరు విమర్శిస్తే, మరికొందరు మాత్రం విద్యార్థులను సమర్థి్స్తున్నారు. బాలీవుడ్‌పై వారి ప్రేమను ప్రశంసిస్తున్నారు.