పాకిస్తాన్కు గట్టి బుద్ది చెపుతాం: భారత విదేశాంగ శాఖ

పాకిస్తాన్కు గట్టి బుద్ది చెపుతాం: భారత విదేశాంగ శాఖ

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్వి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పుల విమరణ ఉల్లంఘిస్తోంది.ఎల్వోసీ దగ్గర పాక్ కాల్పులు జరిపింది. డీజీఎంవో మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరియైనది కాదు. సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా పాకిస్తాన్  చర్యలు తీసుకోవాలన్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తున్నామన్నారు విక్రమ్ మిస్రీ. మరోవైపు భారత్ ఆర్మీకి పుల్ పవర్స్ ఇచ్చామన్నారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడినైనా తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించారు. 

శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, అఖ్నూర్ ,ఉధంపూర్ సెక్టార్లలో భారీ కాల్పులు జరపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఒప్పంద కుదిరిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్యపై భారత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉధంపూర్‌లో డ్రోన్ దాడి, శ్రీనగర్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.ఇప్పటివరకు 7–8 పేలుళ్లు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి. హింస కొనసాగుతుందనే భయాలను పెంచుతున్నాయి. దీంతో భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి. సరిహద్దు వెంట పొంచి ముప్పును తరిమికొట్టేందుకు ఆర్మీ సిద్దమైంది. పాక్ రెచ్చగొట్టే ప్రతి చర్యకు సమాధానం చెపుతామని అధికారులు ప్రకటించారు.

►ALSO READ | పాక్ వక్రబుద్దికి భారత్ రియాక్షన్..మరోసారి ఆర్మీకిఫుల్ పవర్స్