పాక్ వక్రబుద్దికి భారత్ రియాక్షన్..మరోసారి ఆర్మీకిఫుల్ పవర్స్

పాక్ వక్రబుద్దికి భారత్ రియాక్షన్..మరోసారి ఆర్మీకిఫుల్ పవర్స్

పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని  ఉల్లంఘించింది. ఎల్ వోసీ వెంబడి దాడులకు దిగింది. సరిహద్దు నగరాలపై డ్రోన్లతో దాడి చేసింది. భారత్ సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన చేయడంతో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఆర్మీ(BSF)కి ఫుల్ పవర్స్ ఇచ్చింది. కాల్పులకు తెగబడితే గట్టిగా బుద్ది చెప్పాలని కోరింది.  సరిహద్దు వెంట పొంచి ముప్పును తరిమికొట్టేందుకు ఆర్మీ సిద్దమైంది. పాక్ రెచ్చగొట్టే ప్రతి చర్యకు సమాధానం చెపుతామని అధికారులు ప్రకటించారు. 

శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, అఖ్నూర్ ,ఉధంపూర్ సెక్టార్లలో భారీ కాల్పులు జరపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఒప్పంద కుదిరిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్యపై భారత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉధంపూర్‌లో డ్రోన్ దాడి, శ్రీనగర్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.ఇప్పటివరకు 7–8 పేలుళ్లు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి. హింస కొనసాగుతుందనే భయాలను పెంచుతున్నాయి. దీంతో భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి. 

►ALSO READ | బార్డర్లో మరోసారి బ్లాకౌట్.. కాల్పుల విరమణ తర్వాత మళ్లీ చీకట్లోనే ప్రజలు