బార్డర్లో మరోసారి బ్లాకౌట్.. కాల్పుల విరమణ తర్వాత మళ్లీ చీకట్లోనే ప్రజలు

బార్డర్లో మరోసారి బ్లాకౌట్.. కాల్పుల విరమణ తర్వాత మళ్లీ చీకట్లోనే ప్రజలు

పాకిస్తాన్ మరో సారి తన వక్ర బుద్ధిని చూపించుకుంది. కాల్పుల విరమణ కోసం ఇండియా కాళ్లు పట్టుకుని.. సీజ్ ఫైర్ అమలులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మరోసారి తన మోసపూరిత వైఖరిని చూపించింది. శనివారం (మే 10) యూఎస్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన పాక్.. చీకటి పడగానే డ్రోన్లు, పేలుడు పదార్థాలతో విరుచుపడుతోంది. 

 కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి.. ఇండియాపై మరోసారి డ్రోన్స్, బంబులతో పాక్ తెగబడటంతో సరిహద్దు ప్రాంతాలలో బ్లాకౌట్ అమలు చేసింది ఇండియన్ ఆర్మీ. అంటే పూర్తిగా కరెంటు ను నిలిపివేసి శత్రువులకు స్థావరాల కనపడకుండా చేయడమే బ్లాకౌట్. 

పాక్ దాడులు చేస్తుండటంతో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాలలో బ్లాకౌట్ అమలు చేస్తున్నారు ఆర్మీ అధికారులు. గుజరాత్ కూచ్ జిల్లాలో డ్రోన్స్ దాడి చేస్తుండటంతో కంప్లీట్ బ్లాకౌట్ అమలు చేస్తున్నట్లు గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘ్వీ ప్రకటించారు.

►ALSO READ | India Vs Pakistan: పాక్ వంకర బుద్ది..భారత్లో మరోసారి పాక్ డ్రోన్లు, పేలుడు శబ్దాలు

జమ్మూ కశ్మీర్ లోని కతువా, ఉదంపూర్ ప్రాంతాలలో కంప్లీట్ బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. డ్రోన్స్, రెడ్ స్ట్రీక్స్, పేలుడు పదార్థాల చప్పుళ్లతో   బ్లాకౌట్ అమలు చేశారు. పాక్ వైఖరిపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఆశ్చర్యానికి గురయ్యారు. సీజ్ ఫైర్ తర్వాత కూడా ఏంటి ఈ దారుణం అని ప్రశ్నించారు. శ్రీనగర్ లో పేలుడు పధార్థాలు పడ్డాయని చెప్పారు. 

ఇక  పంజాబ్ మోగ, పఠాన్ కోట్, ఫిరోజ్ పూర్  ప్రాంతాలలో కూడా బ్లాకౌట్ అమలు చేస్తున్నారు. పాక్ పెల్లెట్స్, డోన్స్ ప్రయోగిస్తుండటంతో బ్లాకౌట్ అమలు చేయడంతో సరిహద్దు ప్రాంతాలు చీకటిమయం అయ్యాయి. 
అదేవిధంగా రాజస్థాన్ జైసల్మేర్, బార్మర్ లో కంప్లీట్ బ్లాకౌట్ విధించారు.