India Vs Pakistan: పాక్ వంకర బుద్ది..భారత్లో మరోసారి పాక్ డ్రోన్లు, పేలుడు శబ్దాలు

India Vs Pakistan: పాక్ వంకర బుద్ది..భారత్లో మరోసారి పాక్ డ్రోన్లు, పేలుడు శబ్దాలు

పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. కాల్పుల విరమణ ప్రకటించి కొన్ని గంటల గడవకముందే ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు తెగబడింది. డ్రోన్ల నుప్రయోగించింది. ఇదే విషయాన్ని స్వయంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒబర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు. దీంతో కేంద్రం అలెర్ట్ అయింది. 

భారత్ పై మళ్లీ పాక్ దాడులకు తెగబడింది. ఆర్టిలరీ గన్స్, డ్రోన్లతో సరిహద్దు నగరాలపై దాడి చేసింది.  కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఎల్ వోసీ వెంబడి డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది. అఖ్నూర్ వెంబడి డ్రోన్లతో పాక్ నిరంతర దాడులు చేస్తూ ఉంది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లో వరుస దాడులకు దిగింది. అఖ్నూర్, రాజౌరి, ఆర్ ఎస్ పురా సెక్టార్లతో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తమైన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 

జమ్మూ కాశ్మీర్, బారాముల్లాల్లో బ్లాక్ అవుట్ అమలులోకి వచ్చింది. పాక్‌ దాడులను సమర్ధవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ పాక్‌ డ్రోన్లు ధ్వంసం చేసింది. పఠాన్‌కోట్‌, ఉదంపూర్‌, ఫిరోజ్‌పూర్‌,  హోషియాపూర్‌, ఎల్‌వోసీ అంతటా బ్లాక్‌అవుట్ ప్రకటించారు. జలంధర్‌, పటియాలా, లుథియానా, ఫిరోజ్‌పురా, జైసల్మేర్, కథువా, సాంబాలోనూ బ్లాక్‌అవుట్ అమలులో ఉంది.

కచ్ సరిహద్దుల్లో కొత్త డ్రోన్లను కనించాయని, శ్రీనగర్ లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఉధంపూర్‌లో కూడా డ్రోన్లు కనిపించాయి. బార్మర్, జైసల్మేర్, హరామి నాలా ,ఖావ్డాలో కూడా డ్రోన్లు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించారు. 

పాక్ తీరుపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒబర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ‘కాల్పు విరమణ ఒప్పందం ఏమైంది? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి" అని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

►ALSO READ | పాక్ విషయంలో భారత వైఖరి మారదు.. సింధూ జలాల ఒప్పందం రద్దులో ఎలాంటి మార్పు లేదు: భారత్