పాక్ డాక్టర్​కు అమెరికాలో.. 18 ఏండ్ల జైలు శిక్ష

 పాక్ డాక్టర్​కు అమెరికాలో.. 18 ఏండ్ల జైలు శిక్ష

న్యూయార్క్: హెచ్1-బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న పాకిస్తానీ డాక్టర్​కు 18 ఏండ్ల జైలు శిక్ష పడింది. టెర్రర్​గ్రూపు ఐఎస్‌‌ లో చేరేందుకు, అలాగే అమెరికాలో దాడులు చేసేందుకు ప్రయత్నించినందుకు 31 ఏండ్ల ముహమ్మద్ మసూద్‌‌కు శుక్రవారం అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. 

మసూద్ పాకిస్తాన్‌‌లో డాక్టర్. గతంలో హెచ్-1బీ వీసాపై మిన్నెసోటాలోని మెడికల్ క్లినిక్‌‌లో రీసెర్చ్ కో ఆర్డినేటర్‌‌గా పనిచేశాడు. 2020 ఏడాది జనవరి, మార్చి మధ్య అతడు సిరియాకు వెళ్లి టెర్రరిస్ట్ ​గ్రూపులో చేరడానికి ప్రయత్నించాడు. అలాగే, అమెరికాలో ఉగ్రవాద దాడులు నిర్వహించాలని ఉందని చెప్పాడు. ఫిబ్రవరి 2020లో సిరియాకు వెళ్లాలని టికెట్​ కూడా కొనుగోలు చేశాడు. కరోనా కారణంగా జోర్డాన్ బార్డర్​ మూతపడడంతో వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలోనే మినియాపొలిస్- సెయింట్ పాల్ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​లో మసూద్ ​పట్టుబడ్డాడు.